శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తిరుపతిలో డిసెంబర్ 12, 13, 14 వ తేదీలలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలను నిర్వహిస్తున్నామని, వేలాదిగా విద్యార్థులు తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.