భీమవరం: పట్టణంలో పాక్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్దం చేసిన ఏబీవీపీ జిల్లా విభాగం నాయకులు
కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, భీమవరం నారాయణ కళాశాల వద్ద ఏబీవీపీ పశ్చిమగోదావరి జిల్లా విభాగం ఆధ్వర్యంలో పాక్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్దం కార్యక్రమాన్ని బుధవారం సాయంకాలం ఐదు గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు పెన్నాడ రమేష్ మాట్లాడుతూ, భారత సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వల్లే పాక్ ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశ భద్రత కోసం ప్రతి భారతీయుడు ఐక్యతగా ఉండాలని, పాక్ ఉగ్రదాడులపై భారత ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.