పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ భావితరాలకు స్వచ్ఛ వాతావరణం అందించాలి: జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు
Machilipatnam South, Krishna | Sep 25, 2025
పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ భావితరాలకు స్వచ్ఛ వాతావరణం అందించేందుకు కృషి చేద్దామని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం మద్యాహ్నం 4 గంటల సమయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో డిఆర్ఓ కలెక్టరేట్ ఉద్యోగుల చేత స్వచ్ఛోత్సవ్ ప్రతిజ్ఞ చేయించారు.