రాజేంద్రనగర్: సైబరాబాద్ పరిధిలో గ్రూప్ -1 ప్రీలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: CP మహంతి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీ. పరిధిలో CRPC సెక్షన్ 144 కింద నిషేధం విధిస్తూ CP అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిషిద్ధ ప్రదేశంలో ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమికూడరాదని సూచించారు. పరీక్షలు నిర్వహించే 9వతేదీ ఉ.6-సా. 6 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 100మీ. పరిధిలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసి ఉంచాలన్నారు