తాడిపత్రి పట్టణంలోని జే సీ పార్క్ సమీపంలో సబ్ సర్ఫేస్ డ్యామ్ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ సబ్ సర్ఫేస్ డ్యాంకు భూమి పూజ చేశారు. మొత్తం 620 మీటర్ల సబ్ సర్ఫేస్ డ్యామ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జే సీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. సబ్ సర్ఫేస్ డ్యామ్ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.