వేములవాడ: మస్కట్లోనే శ్రీకృష్ణ దేవాలయం సందర్శించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మస్కట్ దేశ పర్యటనలో ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయం, శ్రీ శివ మందిరాలను సందర్శించి స్వామివార్ల దర్శనాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల ప్రాముఖ్యతను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎన్నారై బైరా దేవ్ యాదవ్, ప్రవాస భారతీయులు తదితరులు పాల్గొన్నారు.