మహానంది క్షేత్రానికి ఈనెల 12న చాగంటి కోటేశ్వరరావు రాక
Nandyal Urban, Nandyal | Feb 4, 2026
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానంది క్షేత్రంలో ఈ నెల 12న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకుడు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నిర్వహించనున్నట్లు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాగంటి కోటేశ్వరరావు వస్తున్నారన్నారు. నందీశ్వరుడు జన్మ వృత్తాంతంపై ప్రవచనాలు వినిపిస్తారన్నారు.