నెల్లిమర్ల: అట్టహాసంగా నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్ డిఎ అభ్యర్థి లోకం నాగమాధవి నామినేషన్
నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్ డిఎ అభ్యర్థి లోకం నాగ మాధవి అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, నాయకులు కంది చంద్రశేఖరరావు, సువ్వాడ రవిశేఖర్, టిడిపి నెల్లిమర్ల మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షితో కలిసి తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం నూకరాజుకు మాధవి అందజేశారు.