రాయదుర్గం పట్టణంలోని రాణిసత్రం బస్టాండు లో దేవాదాయశాఖ వారి ఆధీనంలో నడుస్తున్న పబ్లిక్ టాయిలెట్ ల నిర్వాహణపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్ ల నిర్వాహణ అధ్వాన్నంగా ఉందని శుభ్రత పాటించడం లేదని నీళ్లు ఉండటం లేదని, దుర్గంధం వెదజల్లుతోందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మండిపడ్డారు. వందలాది మంది పల్లె ప్రజలు ఇక్కడ వస్తుంటారని ఇప్పటికైనా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.