కొండపల్లిపాడులో బయటపడ్డ పురాతన విగ్రహాలు
తిరుపతి జిల్లా ఓజిలి మండలం కొండవల్లిపాడు గ్రామపంచాయతీలోని శివాలయం దగ్గర ఉన్న స్థలంలో అమ్మవార్ల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన విగ్రహాలు బయటపడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఆ స్థలంలో వ్యవసాయం సాగు చేసేందుకు ఓ రైతు తవ్వకం ప్రారంభించడంతో ఈ విగ్రహాలు బయటపడినట్లు తెలుస్తుంది. వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాలుగా అక్కడ పలువురు గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే విగ్రహాలు బయటపడిన విషయం బయట ప్రపంచాన్ని తెలియకుండా దాచా లన్న ఉద్దేశంలో ఆంతర్యం తెలియడం లేదని స్థానికంగా పలువురు గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు. స్థానిక గ్రామంలో పురాతన విగ్