మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. శనివారం సాయంత్రం రెబ్బెన మండలంలోని గోలేటీ లో వసుధ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని ఆ సంస్థ సభ్యురాలు ఉమా. వరంగల్ జోన్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ అచ్చేశ్వరావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహిళలు కుట్టు మిషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని. టైలరింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.