రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ లో రెండు రోజులుగా జరుగుతున్న కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. గురువారం హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ లో రాయదుర్గం యువఫైథాన్స్ టీం, పైతోట బ్యాడ్ బాయ్స్ టీం తలపడగా పైతోట బ్యాడ్ బాయ్స్ టీం విజయం సాధించింది. విజేతలకు కాలవ ఫౌండేషన్ చైర్మన్ కాలవ భరత్ చేతుల మీదుగా రూ. 20 వేల నగదు బహుమతి, రన్నర్స్ కు రూ. 10 వేల నగదు బహుమతి అందజేశారు. కబడ్డీ క్రీడాకారులను అభినందించారు. ఈ మ్యాచ్ తిలకించేందుకు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.