ఈనెల 17న ధర్మపురిలో నిర్వహించనున్న అభినందన సభను విజయవంతం చేయాలని పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ పిలుపునిచ్చారు. పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ధర్మపురిలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.