ములుగు: రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతి కారణంగా కోతకు గురైన NREGS నర్సరీ
Mulug, Mulugu | Sep 14, 2025 ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పక్కనే ఏర్పాటుచేసిన NREGS నర్సరీ స్థలం ఆదివారం కోతకు గురైంది. ప్రతి ఏటా నర్సరీలో అధికారులు మొక్కలు పెంపకం చేపట్టి రోడ్డుకు ఇరువైపులా నాటుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ ప్రాంతం కోతకు గురి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.