అసిఫాబాద్: పులి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి:తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి బాపురావు
పులుల దాడి నుంచి మనుషులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి బాపురావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంగానే మనషుల ప్రాణాలు పోతున్నాయని మండి పడ్డారు. పులి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. పులి దాడిలో గాయపడిన వారికి ఇప్పటి వరకు ఆదుకోలేదన్నారు. అదివాసులపైన ప్రేమ ఉంటే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని,పులిపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు.