సంగారెడ్డి: నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని INTUC జిల్లా అధ్యక్షుడు నరసింహ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ పాలన ఉన్న చట్టాలను తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.