అనంతపురం జిల్లాలో వేపకు తెగులు సోకింది. రాయదుర్గం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా వేపకు వైరస్ వ్యాపించింది. దీంతో వేప చెట్టంతా నిలువెల్లా ఎండిపోతూ ఆకులన్నీ రాలిపోతున్నాయి. వేసలి ప్రారంభం కాకముందే వందలాది చెట్ల ఎండిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శిలీంద్రానికి సంబంధించిన వైరస్ సోకడంవల్ల వేపకు ఈ ప్రమాదం ఏర్పడిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే మళ్లీ వర్షాలు కురిసి వాతావరణ మార్పులు జరిగితే తిరిడి చిగురించే అవకాశం ఉందంటున్నారు.