ఈనెల 24న గన్నవరంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన సిఆర్ పి ఎఫ్ డిఐజి కమలేష్ సింగ్, జిల్లా కలెక్టర్
Machilipatnam South, Krishna | Sep 22, 2025
ఈనెల 24న గన్నవరంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన సిఆర్ పి ఎఫ్ డిఐజి కమలేష్ సింగ్, జిల్లా కలెక్టర్ ఈనెల 24వ తేదీన నూతన గౌరవ ఉపరాష్ట్రపతి సి పి రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో సోమవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో సిఆర్పిఎఫ్ డిఐజి కమలేష్ సింగ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ఇంటలిజెన్స్ భద్రత విభాగం డిఐ జి. హఫీజ్, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్ కె రెడ్డి లతో కలిసి స్తానిక గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సంబంధిత అధికారులతో ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.