భీమిలి: చిల్లర వర్తకులు భారీ బైక్ ర్యాలీతో జోన్2 కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో రోడ్డు ఆక్రమణల తొలగింపు చర్యలపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధురవాడ చిల్లర వర్తకుల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యమానికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. తమ జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వ్యాపారులు ఆరోపించారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి జోన2 కార్యాలయం ముట్టడి చేసి ఆందోళన నిర్వహించారు.