పెదచెర్లోపల్లి మండలంలోని జంగాలపల్లి గ్రామంలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 KV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను పెదచెర్లోపల్లి మండల టిడిపి అధ్యక్షులు వేమూరి రామయ్య పార్టీ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. మంత్రి రవికుమార్ కృషితో మండలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని రామయ్య తెలిపారు.