మార్కాపురం జిల్లా కంభం సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయా రహదారిపై మద్యం తాగి వాహనం నడిపిన ఓ వాహనదారుడుపై ఎస్ఐ శివకృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు. శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా జైలు శిక్ష కూడా పడుతుందని ఎస్ఐ శివకృష్ణారెడ్డి ప్రజలను హెచ్చరించారు.