ఖమ్మం అర్బన్: విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్, స్థానిక టి.టి.డి.సి. లో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ అంశాలపై నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మనం ప్రతిరోజు చేయాల్సిన విధులు, బాధ్యతలను పక్కాగా నిర్వహించేందుకు శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయని, రెవెన్యూ శాఖలో నిష్ణాతులైన ట్రైయినర్లు అందించే రెండు రోజుల పాటు శిక్షణను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు.