మార్కాపురం జిల్లా కొమరోలు మండల టిడిపి నాయకుడు వెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వెంకటయ్య మృతి పై విచారం వ్యక్తం చేస్తూ వెంకటయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. వెంకటయ్య కుమారుడు అయినటువంటి వెంకటేశ్వర్లు ప్రస్తుతం కొమరోలు మండల టిడిపి అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.