విద్యార్థులందరూ గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తాడిపత్రి రూరల్ ఎస్సై కాటయ్య అన్నారు. తాడిపత్రి రూరల్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందన్నారు. అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.