చీపురుపల్లి: గుర్ల మండలం గుజ్జంగివలస లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
గుర్ల మండలం గుజ్జంగివలస లో బుధవారం రాత్రి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పుల్లే రామ్మోహన్ శర్మ భక్తులతో సీతారాముల కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ స్వామి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.