వైరా: వైరాలో అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా అక్రమ కట్టడాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
Wyra, Khammam | Sep 21, 2025 ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ 14 వ వార్డు ఎన్ హెచ్ 9 ప్రధాన రహదారి పక్కన కొందరు అక్రమార్కులు రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ఈ అక్రమ కట్టడాలు వలన రాజ్యాంగ నిర్మాత , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా, ఆ మహానీయుడు ఆశయాలు తన యొక్క ఆలోచన విధానం ప్రజలు తెలుసుకోకూడదని దురాలోచనతో అంబేద్కర్ విగ్రహానికి అనుకొని భారీ స్థాయిలో కట్టుబడులు నిర్వహిస్తున్నారని. ఇలా నిర్మించే వారిపై తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు.