కామారెడ్డి: ఆసుపత్రులు రోగనిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి : పట్టణంలో జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్
ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఆస్పత్రులుగాని, రోగ నిర్ధారణ కేంద్రాలు గాని ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకొని మాత్రమే ఆసుపత్రి నడపాలని అన్నారు. అనుమతి లేని ఆసుపత్రులకు, రోగ నిర్ధారణ కేంద్రాలకు నోటీసులను జారీ చేయాలని తెలిపారు. అడ్వర్టైజ్మెంట్ చేయకూడదని పేర్కొన్నారు.