మేడ్చల్: కాప్రా డివిజన్ లో యూజీడి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా డివిజన్ పరిధిలోని మహమ్మదీయ కాలనీలో ఏడు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన యూజీడి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ భైరి నవీన్ గౌడ్, మైనార్టీ నాయకులు బదిరుద్దీన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.