ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి నిర్మాణం వరకు అవినీతే జరిగిందన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. తనను అడగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు.