కుందుర్పి మండల కేంద్రంలోని రామస్వామి దేవాలయం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదంలో విద్యుత్ స్తంభం కింద భాగం దెబ్బతినింది. రోడ్డు పూర్తిగా ఇరుకుగా ఉండడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.