సిర్పూర్ టి: డబ్బా గ్రామపంచాయతీలో 30 లక్షల గోల్ మాల్, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామ ప్రజలు
చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామపంచాయతీ లో 30 లక్షల గోల్డ్ మాల్ అయినట్లు గ్రామ ప్రజలు ఆరోపించారు. గ్రామంలో మొత్తం 381 మరుగుదొడ్లకు 57.83 లక్షలు మంజూరు కాగా, మాజీ సర్పంచ్ కార్యదర్శి బినామీల పేరుతో 30 లక్షల అవినీతికి పాల్పడ్డారని సంతోష్ ఆరోపించారు. ఈ అవకతవకలపై సోమవారం అసిఫాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సంతోష్ సోమవారం తెలియజేశారు. 30 లక్షల గోల్ మాల్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు,