రాజేంద్రనగర్: మైలార్దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి...
బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తాలో జరిగింది. చౌరస్తాలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద బైకును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు