కనిగిరి మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం కనిగిరిలో పర్యటించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... గతంలో గార్లపేట రోడ్డులో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, అయితే పనులు ముందుకు సాగలేదని, వెంటనే సబ్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తిచేయాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రవికుమార్ త్వరలోనే సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.