సిర్పూర్ టి: ఇందిరమ్మ ఇండ్ల నాణ్యత పై రాజీ వద్దు, కాగజ్ నగర్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పై రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లు నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మించుకునేందుకు అవగాహన కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు,