అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.