ఖానాపూర్: సీఆర్టిల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి: ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్
సిఆర్టిల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భుక్య రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం కడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 6 నెలలుగా సిఆర్టిలకు వేతనాలు ఇవ్వకపోవడంతో సిఆర్టిలు ఆర్థిక ఇబ్బందుల్లో కూడుకపోతున్నారని వెంటనే వారి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో LHPS జిల్లా అధ్యక్షులు రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.