కొండపి: టంగుటూరు మండలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, టిడిపి నాయకులకు హెచ్చరిక,
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కొండపి వైసీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేశ్ పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి 100 సీట్లు దాటిందంటే టీడీపీ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో తమను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.