శ్రీకాకుళం జిల్లా పలాస పాతజాతీయ రహదారి వద్దగల పెట్రోల్ బంక్ నుండి వజ్రపుకొత్తూరు మండల కేంద్రం వరకు రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. 2019 లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. 16 కిలోమీటర్ల రోడ్డుకు గాను మద్యమధ్య కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు పూర్తిచేయకుండా మెటల్ పరిచి విడిచిపెట్టడంతో వచ్చిపోయే వాహనాలు కొన్ని బోల్తాపడుతుండగా,చాలావరకు వాహనాల టైర్లుకు పంక్చర్లు పడుతున్నాయి.