నిడమానూరు: నిడమనూర్ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి:CPM జిల్లా కమిటీ సభ్యులు శ్రీను
నల్గొండ జిల్లా : అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నిడమనూరు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీను, కోటేష్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామ కార్యదర్శి గ్రామంలో నిధులు దుర్వినియోగం చేస్తూ అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గ్రామపంచాయతీ కార్మికులపై పని ప్రారంభించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు.