హిమాయత్ నగర్: ibomma రవి సీక్రెట్ కెమెరాల ద్వారా కొత్త సినిమాలను రికార్డు చేసేవాడు : సీపీ సజ్జనార్
బంజారాహిల్స్ లోని కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ సోమవారం మధ్యాహ్నం ఐ బొమ్మ రవి గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవి ఓటిటిరో రిలీజ్ అయ్యే సినిమాలను కొత్త టెక్నాలజీని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్ చేసేవాడని ఇదంతా మంచి క్వాలిటీతో వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడని అన్నారు. సినిమాలను సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డు చేసేవాడని అన్నారు. ఈ మొత్తం పైరసీ రాకేట్ టెలిగ్రామ్ ద్వారా నడిచింది అన్నారు.