తొలి ఏకాదశిని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులు పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు తో కలసి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఉమా రెడ్డి దంపతులు స్వామివారికి పంచామృత అభిషేకము, అలంకరణ, స్వామివారి కళ్యాణం మహోత్సవ కార్యక్రమం కొనసాగింది భక్తులు అత్యంత భక్తి భవంతో కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆషాడంలో వచ్చే ఏకాదశి తెలంగాణ ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగ జరుపుకుంటారని అన్నారు తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు సకల శుభాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు