మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో భారీ వృక్షాలు తొలగించడం పై స్థానిక ప్రజలు అభ్యంతరం తెలిపారు. ఎన్నో సంవత్సరాలగా వైద్యశాలలో ఉన్న సిబ్బందికి రోగులకు నీడనిచ్చే చెట్లను తొలగించడం పై సూపర్డెంట్ నిర్ణయం సరైనది కాదన్నారు. వైద్య సిబ్బంది కూడా నీడనిచ్చే చెట్లను తొలగించడంతో వారు కూడా ఆవేదనకు లోనైనట్లు తెలిపారు. వృక్షాలను పెంచాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని తీసివేయడం ఎంతోసేపు పడదు అని విమర్శించారు.