గూడూరులో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
గూడూరు పట్టణంలోని సంగం సినిమా హాలు సమీపంలో రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీనిని తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రారంభించారు. వాళ్లు మాట్లాడుతూ.. బైపాస్ సర్కిల్ నుంచి గూడూరు సంగం హాలు వరకు సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.