ములుగు: మా గ్రామంలో ఎలాంటి యూరియా కొరత లేదు: జగ్గన్నపేట రైతులు
Mulug, Mulugu | Sep 14, 2025 తమ గ్రామంలో ఎలాంటి యూరియా కొరత లేదని ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామ రైతులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది యూరియా కొరత ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. యూరియా కొరత లేదని, ఉదయాన్నే యూరియా దిగుమతి కాగా వెళ్లి తెచ్చుకున్నామన్నారు.