బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 20, 2025
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాలుష్య నియంత్రణ చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లు, క్లినిక్లు మరియు డయాగ్నస్టిక్ సెంటర్లు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.