నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని శ్రీశైలం రేంజ్ పెచ్చెర్వు ప్రాంతంలో అడవికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ బైకులు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డీడీ విగ్నేష్ అప్పావ్ విచారణ చేస్తున్నారు.