లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇళ్లు ఇచ్చారా : ఎమ్మెల్యే దగ్గుబాటి
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. గత ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇళ్లు ఇచ్చారా అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిలదీశారు. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అర్హత పొందిన లబ్ధిదారులకు నిర్మాణ అనుమతి పత్రాలను ఆయన అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మొత్తం 657మందికి నిర్మాణ అనుమతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు.