మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో బీసీ సంక్షేమ అధికారి ఝాన్సీ రాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి బి సి ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, భవనం శిథిలావస్థలో ఉందని పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ తనిఖీ చేశారు. అయితే భోజనంలో పురుగులు లేవని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించామని ఝాన్సీ రాణి తెలిపారు.