తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం పోలీసులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాడిపత్రి రూరల్ పరిధిలో సీఐ శివగంగాధర్ రెడ్డి, యాడికి పరిధిలో సీఐ శ్రీనివాసులు, పెద్దవడుగూరు పరిధిలో ఎస్ఐ ఆంజనేయులు సైబర్ నేరాలపై పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో మోసం చేస్తున్నారన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.