శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శనాన్ని కల్పించి పూజలు జరిపించారు. అనంతరం ఆయనను సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.